హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు(Couple injured). వివరాల్లోకి వెళ్తే.. బైక్పై వెళ్తున్న దంపతులను లారీ(Lorry) ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. మంటలు చెలరేగి బైక్ పూర్తిగా దగ్ధమైంది. దంపతులిద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.