హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ-2008 అర్హులైన అభ్యర్థుల జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయి. ఐటీడీఏకు చెందిన 67 పోస్టులు కలిపితే మొత్తంగా 102 మందిని జాబితాలో చేర్చలేదు. దీంతో వారు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు తరలివచ్చారు.
100 మందికి పైగా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరారు. దీంతో స్పందించిన ఆయన ప్రాథమిక జాబితాలో పేర్లుండి, కొత్త జాబితాలో పేర్లు లేకపోతే ఇలాంటి వారికి సైతం అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సర్క్యూలర్‌ను జారీచేస్తామని అభ్యర్థులకు భరోసాకల్పించారు.