పాల్వంచ, అక్టోబర్ 23 : ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కరకవాగు గ్రామానికి చెందిన గుగులోతు నాగరాజు ఇల్లు నిర్మించుకుంటున్నాడు. తా త్కాలికంగా పక్కనే ఉన్న తన మామ ఇంటి నుంచి కరెంట్ తీసుకున్నాడు. గమనించిన లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు కేసు నమోదు చేస్తా నని నాగరాజును భయపెట్టాడు. కేసు లేకుండా చేయాలంటే రూ.65 వేలు లంచం డిమాండ్ చేయగా, 26 వేలకు ఒప్పం దం కుదిరింది. బుధవారం పాల్వంచలోని అంబేద్కర్ కూడలిలో బాధితుడి నుంచి లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.