హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు లైన్ క్లియర్ అయింది. ప్రమోషన్లపై దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ పునఃప్రారంభం కానున్నది.
త్వరలో పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసి, కొత్త షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నది.