హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ) రూ.922.03 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. మొత్తం 140 యూఎల్బీల్లో రూ.1300.07 కోట్ల పన్ను రావాల్సి ఉండగా.. 70.92 శాతం వసూలైందని, మిగతా రూ.378.04 కోట్లమేర బకాయిలు పెండింగులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
99.52 శాతం పన్ను వసూళ్లతో సిరిసిల్ల ప్రథమ స్థానంలో ఉండగా, అతి తక్కువగా 34.77 శాతం వసూళ్లతో జహీరాబాద్ మున్సిపాలిటీ చివరి స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు.