కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 13: పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి నుంచి విరమణ పొంది, బకాయిలు అందక ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు ఆ సంఘం ప్రతినిధులు సోమవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కరీంనగరంలోని తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ.. ఏడాది క్రితం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
దాచుకున్న డబ్బులు అందక ప్రాణాలు పోతున్నాయని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది చనిపోయినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి గద్దె జగదీశ్వరాచారి, సుంకిశాల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. చనిపోయిన పెన్షనర్లకు సంబంధించి బకాయిలతోపాటు వెంటనే ఎక్స్‌గ్రేషియా కూడా అందజేయాలని డిమాండ్ చేశారు.
కోల్డ్రిఫ్ తయారీ.. కంపెనీ లైసెన్స్ రద్దు
చెన్నై: కలుషిత దగ్గు మందు కోల్డ్రిఫ్ను తయారు చేసిన శ్రేసన్ ఫార్మాస్యుటికల్ కంపెనీ లైసెన్సును తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కంపెనీ కార్యకలాపాలన్నిటినీ నిలిపేయాలని ఆదేశించింది.