హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు దక్కింది. త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీకి గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది.
ఈ మేరకు సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.