హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): మిగతా గురుకులాల్లో మాదిరిగానే ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పదోన్నతులు కల్పించాలని జేఏసీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిని ఎస్సీ గురుకులాల జేఏసీ ప్రతినిధులు నారాయణ, మధుసూదన్,జనార్దన్, వేదాంతచారి, బిక్షం కలిసి వినతిపత్రం అందజేశారు.
గురుకులాల్లో ప్రిన్సిపాల్ పోస్టుకు 1:3 సెలక్షన్ నిర్వహించడంతో సీనియర్లు నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. పీజీటీ, జేఎల్ పదోన్నతుల్లో మిగతా గురుకుల సొసైటీల్లో అనుసరిస్తున్న 70:30 పద్ధతిలో కాకుండా 50:50ను పాటించడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించాలని కోరారు.