Inter Colleges | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా ప్రైవేట్ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఈ ఏడాది 6.23లక్షల మంది ప్రైవేట్లో చదువుతున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీలు, గురుకులాల్లో 3.15లక్షల మంది మాత్రమే చదువుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మొత్తం 9.4లక్షల మందిలో 70శాతానికిపైగా ప్రైవేట్ కాలేజీల్లో చదువుతుండగా, 30శాతం లోపు విద్యార్థులు సర్కారు కాలేజీల్లో చదువుతున్నారు.
సంఖ్యాపరంగా సర్కారు కాలేజీలతో పోల్చితే ప్రైవేట్ కాలేజీలు 500 తక్కువగా ఉన్నాయి. సర్కారులో కాలేజీలెక్కువ అడ్మిషన్లు తక్కువగా ఉండగా, ప్రైవేట్ కాలేజీలు తక్కువగా ఉండగా, అడ్మిషన్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్లో రెసిడెన్షియల్ కాలేజీలు అత్యధికంగా ఉండటం, జేఈఈ, నీట్, ఎప్సెట్ కోచింగ్ కోసం వాటిల్లో చేరుతున్నారు.