Police patrol | ఇటిక్యాల, మే 27: పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల లో సోమవారం చోటుచేసుకున్నది. ఇటిక్యాలలోని 44వ జాతీయ రహదారి యాక్తాపురంశివారులో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుకు అడ్డంగా బైక్ను ఆపడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు బైక్ను పక్కకు జరిపి ట్రాఫిక్ సమస్య లే కుండా చూశారు. దీంతో అతడు పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేశాడు. తర్వాత కోదండాపురం పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన వదిలేశాడు.