హైదరాబాద్, మార్చి 27(నమస్తేతెలంగాణ): ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూ డు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. వచ్చే రెండురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో కొనసాగుతాయని తెలిపారు.
ఆ తర్వాత నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని పేర్కొన్నారు.