హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గోవాలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 19వ గ్లోబల్ కాన్క్లేవ్లో హైదరాబాద్ చాప్టర్ పీఆర్సీఐకి అవార్డులు దక్కాయి. ఉత్తమ పాలన అవార్డును హైదరాబాద్ చాప్టర్ దక్కించుకుంది. హైదరాబాద్ పీఆర్సీఐ చైర్మన్ షకీల్ అహ్మద్, వైస్ చైర్ పర్సన్ అనీజా, కార్యదర్శి ఫిలిప్ జాషువా, జాయింట్ సెక్రటరీ జేకబ్రాస్, కోశాధికారి నోయెల్ రాబిన్సన్ అవార్డు అందుకున్నారు.
షకీల్ అహ్మద్‌కు ‘జీపీ జైకుమార్ మెమోరియల్ అవార్డు ఫర్ ఇంటిగ్రల్ పబ్లిక్ రిలేషన్స్’ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, డీఎస్‌సీఐ, నాస్కామ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ‘చాణక్య అవార్డు’ లభించింది. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.