హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదనని హైకోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బఫర్జోన్ల పరిధిలో ఏవిధమైన నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. చెరువులను ఆక్రమణలు నుంచి రక్షించాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని చెప్పింది.
ఆగస్టు 11లోగా హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల బఫర్ జోన్లను నిర్ధారించి, నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. రామమ్మకుంట బఫర్‌జోన్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ భవన నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ దాఖలు చేసిన పిల్‌ను సీజే జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారించింది. బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.