హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 38మంది జిల్లా, సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ మంగళవారం హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో ఉన్న జడ్జీలు బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించి రిలీవ్ కావాలని పేర్కొన్నారు.
23లోగా కొత్త పోస్టుల్లో బాధ్యతలను చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే వాదనలు పూర్తిచేసి రిజర్వు చేసిన కేసుల్లో తీర్పు వెలువరించేందుకు అనుమతించారు.