హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మేకల తిరుపతన్న దాఖలు చేసిన బెయిలు పిటిషన్పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. శనివారం ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జువ్వాది శ్రీదేవి తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు ప్రకటించారు.
ఈ కేసులో దర్యాప్తు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న తరఫు న్యాయవాది వీ సురేందర్రావు కోరారు. వాదిస్తూ, ఎస్ఐబీలో సభ్యుడిగా ఉన్న పిటిషనర్ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించారని, తప్పు చేయలేదని చెప్పారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్రావు స్పందిస్తూ, ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని, బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు.