హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి కేటాయింపు వివాదంపై క్యాట్ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ, జస్టిస్ ఈ తిరుమలాదేవి ధర్మాసనం క్యాట్కే అప్పగిస్తూ త్వరగా వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది.