హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ సంప్రదాయాలను పాటిస్తూ ఆ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్న గిరిజన దంపతులకు విడాకులు మంజూరు చేసేందుకు హిందూ వివాహ చట్టాన్ని వర్తింపజేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వివాహాలు హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగినట్టు ఆధారాలుంటే హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు మంజూరు చేయవచ్చని జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలానికి చెందిన కడావత్ శ్రీకాంత్, అశ్విత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించడంతో.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి హిందూ వివాహ చట్టం వర్తించబోదంటూ పిటిషన్ను స్వీకరించలేదు. దీన్ని సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్పై ఇటీవల హైకోర్టు విచారణ చేపట్టింది.