హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల కింద ట్రైబ్యునళ్లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖ, న్యాయశాఖ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు, పురపాలకశాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఆ రెండు శాఖల చట్టాల కింద ఎదురయ్యే వివాదాల పరిషారానికి ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలన్న నిబంధనలు అమలు కాలేదంటూ అందిన లేఖను హైకోర్టు సుమోటో పిటిషన్ పరిగణించి విచారించింది. ట్రైబ్యునళ్ల ఏర్పాటు చేయకపోవడంతో కోర్టుల్లో కేసుల భారం పెరుగుతోందని, లేఖలోని అంశాలపై ప్రభుత్వ వాదనలతో కౌంటర్ సీపీఎస్ రద్దు చేయాల్సిందే