హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు హామీ ఇచ్చిన గడువులోగా పరిహారం ఎందుకు చెల్లించలేదని నాలుగు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ప్రశ్నించింది. సామాజిక కార్యకర్త కొండల్‌రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
వాదనల తర్వాత హైకోర్టు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, జనగాం కలెక్టర్ రిజ్వాన్‌బాష షేక్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాలకు నోటీసులు జారీచేసింది.
రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో ఆదేశించిన మేరకు మౌలిక వసతుల కల్పన అమలు నివేదికను సమర్పించాలని కోరింది.