హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): చేప పిల్లల పంపిణీ బిల్లులు చెల్లించాలన్న తమ ఆదేశాలను అమలుచేయాలని మరోసారి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు అమలుచేయని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించింది. బకాయిల చెల్లింపు ఉత్తర్వుల అమలుకు నాలుగు వారాలు గడువు కావాలని ప్రభుత్వం కోరడంతో అందుకు హైకోర్టు అనుమతించింది.
ఈసారి అమలుచేయకపోతే, ఫిబ్రవరి 6న జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించించి.. విచారణను వాయిదా వేసింది. 2023-24 ఏడాది బిల్లుల బకాయిల చెల్లింపు కోసం శ్రీసాయి ఫిష్సీడ్స్, ఇతరులు పిటిషన్లు వేశారు. బకాయిలు చెల్లించాలని గత ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అమలు చేయలేదంటూ వారందరూ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ టీ మాధవీదేవి విచారించి పై విధంగా ఆదేశించారు.