హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లిటిగేషన్లోనూ అతి పెద్దదేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన రైతు నర్సిరెడ్డిగారి బాల్‌రెడ్డి, షాపూర్‌నగర్‌కు చెందిన కల్లం మాధవరెడ్డికి అనుకూలంగా 2018లో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని, వాటిని కొట్టివేయాలని కోరుతూ ఎస్బీఐ ఏడేండ్ల తర్వాత పిటిషన్ దాఖలు చేయడంపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్య చేసింది.
డీఆర్టీ ఆదేశాలపై పిటిషన్ దాఖలులో జాప్యానికి కారణాలేమిటో బుధవారం జరిగే విచారణలో చెప్పాలని ఎస్బీఐని ఆదేశించింది.