హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఇన్చార్జి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి నియామక జీవోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 21న జరిగే తదుపరి విచారణకు వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి వ్యక్తిగతం గా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యం విచారణ పూర్తయ్యే వరకు విచారణకు హాజరుకావాలని చెప్పింది. డీఎంఈ రమేశ్‌రెడ్డి నియామక జీవోను కొట్టివేస్తూ గత ఏప్రిల్ 24 హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం తో హెల్త్‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసింది.
రమేశ్ పదోన్నతిపై వివరణ ఇవ్వండి
రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజర్ ఎం రమేశ్ పదోన్నతిపై ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, చైర్మన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేనేజర్‌గా రమేశ్‌కు పదోన్నతి కల్పిస్తూ కార్పొరేషన్ ఎండీ ఆగస్టు 28న జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జీ దేవదాస్, ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు. పదోన్నతిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను హైకోర్టు జనవరి 25కు వాయిదా వేసింది.