ఆర్బీఐ గవర్నర్‌కు నోటీసులు
కోర్టు ధికరణ కేసులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గత ఏప్రిల్ 24న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ షేర్‌హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టుధికరణ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
- జూలై 7లోగా వివరణ ఇవ్వాలి
- కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు
హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): కోర్టు ధికరణ కేసులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గత ఏప్రిల్ 24న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ షేర్‌హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టుధికరణ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో జూలై 7లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి 2018 సెప్టెంబర్‌లో బ్యాంక్ జారీచేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ షేర్‌హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకు నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పింది. దీనిపై అప్పట్లో స్పందించిన హైకోర్టు బ్యాంకు వినియోగదారుల రక్షణ కోసం బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని ఆర్బీఐని ఆదేశించింది. ఇప్పటి వరకు అధికారిని నియమించకపోవటంతో అసోసియేషన్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని, ఇది కోర్టు ధికారంగా పరిగణించి అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. తదుపరి విచారణను కోర్టు జూలై 7కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

