Yuva Sangrama Sadassu | సదస్సుకు హైకోర్టు అనుమతి.. సభ నిర్వహించుకునే హక్కు ఉన్నదని స్పష్టం
Yuva Sangrama Sadassu | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది.
- బీఆర్ఎస్ సభకు సర్కార్ అనుమతి నిరాకరణ
- ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి
Yuva Sangrama Sadassu | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. సదస్సును శాంతియుతంగా నిర్వహించాలని, జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, రహదారుల దిగ్బంధం, ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదని, చట్టం-శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు విధించే అన్ని సహేతుకమైన షరతులను పాటించాలని న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొదట అనుమతివ్వని పోలీసులు
బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు మొదట పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. సభ అనుమతి కోసం చేసిన దరఖాస్తుపై పోలీస్ కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదురొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని కోర్టుకు వివరించారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వాహనాల పారింగ్ సదుపాయం కల్పించామని, భద్రత కోసం 25 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 15 మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, అగ్నిమాపక శాఖ ఫీజులు, స్టేడియం అద్దె తదితర చెల్లింపులు కూడా పూర్తిచేశామని, అయినా పోలీసులు అనుమతి మంజూరు చేయలేదని వాదించారు.
ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం
సదస్సులో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలోని విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వం తరఫున న్యాయవాది మహేశ్ రాజే కోర్టుకు తెలిపారు. జాతీయ రహదారి దిగ్బంధం, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని, నిఘావర్గాల నివేదిక కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నదని వాదించారు. ప్రభుత్వ వాదనలను పరిశీలించిన హైకోర్టు, కేవలం ఇంటెలిజెన్స్ నివేదికలు లేదా కొందరు విద్యార్థి నాయకులపై గతంలో కేసులు నమోదయ్యాయనే కారణంతో ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించే సభకు అనుమతి నిరాకరించడం సమంజసం కాదని స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్-19 కింద ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే హకు ఉన్నదని పేరొన్నది. ఆ హకును ఆధారాలు లేకుండా పరిమితం చేయలేమని అభిప్రాయపడింది. సదస్సుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ తుది ఉత్తర్వులను వెలువరించింది.
ఈ తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు
బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతివ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టు. ఈ సదస్సును అడ్డుకొనేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేసింది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా నిరుద్యోగ యువత తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది. యూత్ డిక్లరేషన్లోని హామీలు నెరవేర్చేదాకా సర్కార్ను వదిలిపెట్టబోము. సభకు నిరుద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చి రేవంత్ సర్కార్ కండ్లు తెరిపించాలి.
– వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

