Traffic challans : వాహనాదారులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్ల వసూలుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనదారుల నుంచి పెండింగ్ బలవంతంగా వసూలు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పెండింగ్ చలాన్ల వసూలు కోసం బైకుల తాళాలు లాక్కోవడం, వాహనాలను ఆపేయడం లాంటివి చేయవద్దని సూచించింది.
వాహనదారులు స్వచ్ఛంగా చలాన్లు చెల్లించేందుకు ఇష్టపడితే పోలీసులు తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. ఒకవేళ పెండింగ్ చలాన్లు ఉండి వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడకపోతే, వారికి నోటీసులు ఇవ్వాలని సూచించింది. వాహనదారుల నుంచి పోలీసులు బలవంతంగా పెండింగ్ చలాన్లను వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపించారు.