సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
మధ్యాహ్న సమయానికి నిప్పులు గక్కినట్లు భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.6, కనిష్ఠం 27.4డిగ్రీలు, గాలిలో తేమ 25శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.