పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

వరంగల్ రూరల్ : పేద ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఆక్సిజన్ తో కూడిన కరోనా కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులో చేరిన పేషంట్ గోపిశెట్టి సుగుణని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు చికిత్స కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పలించిందన్నారు. వైద్య సిబ్బంది ఎల్లపుడు అందుబాటులో ఉండాలని సూచించారు.
కరోనా మహమ్మారి అరికట్టడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పని చేస్తున్న వైద్య, పోలీస్, పారిశుధ్య రంగాల కృషి మరవలేనిదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అజాగ్రత్తతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దన్నారు.
లాక్ డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఏరియా దవాఖానలో వార్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

