హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల విభజనలో పదోన్నతులు వెనక్కి తీసుకున్న ఇంజినీర్లకు న్యాయం చేయాలని పదోన్నతులు కోల్పోయిన ఇంజినీర్లు ప్రభుత్వాన్ని కోరారు. తమకు గతంలో కల్పించిన పదోన్నతులను తిరిగి ఇప్పించాలని ఆదివారం ఒక ప్రకటనలో విన్నవించారు.
గతంలో 166 మంది ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించారని, ఏపీ ఉద్యోగులను ఇక్కడికి కేటాయించడంతో పదోన్నతులు కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని బాలాజీ, సురేష్‌బాబు, ప్రవీణ్‌కుమార్, అంజనీరెడ్డి తదితరులు కోరారు.