ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది : ఎమ్మెల్యే దాసరి
ఎమ్మెల్యే దాసరి | కరోనాతో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.

పెద్దపల్లి : కరోనాతో ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలో తాజా పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, సుల్తానాబాద్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ శ్రీ రాంతో చర్చించారు.
పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు, సుల్తానాబాద్ లో పడకల సంఖ్య, ఆక్సిజన్ లభ్యత, రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్యులు, నర్సుల తోపాటు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.
కరోనా బారిన పడిన రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆక్సిజన్ తో పాటు మందుల కొరత లేదని అవసరమైన మేర పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కరోనా సోకిన రోగులు ఆందోళన చెందకుండా ధైర్యంతో ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి…
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెరుగైన సేవలందించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

