హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ) : హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి వర్షిణిదే బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించింది.
ఎస్సీ గురుకులంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయులను అకారణంగా నడిరోడ్డున పడేశారని, ఫలితంగా మానసిక వేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందులో భాగంగానే హన్మకొండ జిల్లా నిరుకుల్ల మండలం ఆత్మకూరు గురుకుల ఉపాధ్యాయుడు కుమారస్వామి మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు.