Nirudyoga Bruthi | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తె లంగాణ): రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు దగా చేసింది. గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హా మీలను బుట్టదాఖలు చేసింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలండర్ ప్రకటన అమ లు కోసం బడ్జెట్లో ఒక్క రూపాయీ ప్రతిపాదించలేదు. దీంతో అసలు రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిరుద్యోగులకు ప్రతినెలా రూ.4,000 నిరుద్యోగ భృతి హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండాపోయింది. గతంలో కేసీఆర్ హయాంలో నిరుద్యోగుల కోసం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించారు. గ్రూప్-1, 2, 3, 4 వం టి నోటిఫికేషన్లతోపాటు టీచర్, పోలీసు, గురుకుల టీచర్ పోస్టులు, స్టాఫ్‌నర్స్ తదితర వేలాది ఉద్యోగాల భర్తీకి ఆనాటి ప్ర భుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని నిరుద్యోగులు రగిలిపోతున్నారు.