హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వనపర్తి జిల్లాలోని ఏదుల కేంద్రంగా 8 గ్రామాలతో మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి జల్లా రేవల్లి మండలం నుంచి రెండు గ్రామాలు, గోపాలపేట నుంచి ఒకటి, నాగర్కర్నూల్ కోడేర్ మండలం నుంచి ఐదు గ్రామాలను కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేశారు.