Bhupalpally | అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎల్ఎంబీ (Land Mortgage Bank) అధికారులు వచ్చి బాకీ కట్టని రైతుల ఇండ్ల తలుపులు ఎత్తుకుపోయేవారు. ఇలాంటి దృశ్యమే మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో భూపాలపల్లి జిల్లాలో కనిపించింది. ఇంటి పన్ను కట్టలేదని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లిలో మేకల కాపరి హునానాయక్ ఇంటి తలుపుల్ని మున్సిపల్ సిబ్బంది ఇలా ఎత్తుకుపోయారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి తలుపులు ఎత్తుకుపోయారని, తలుపులు ఇవ్వకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హునానాయక్ ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు.