హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి, పత్తి వంటి పంటల కంటే కూరగాయలసాగు రైతులకు లాభదాయకమని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ రాజిరెడ్డి సూచించారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి ఎంపిక చేసిన ఏడు జిల్లాల రైతు వలంటీర్లకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించారు. పామ్ఆయిల్ తోటల్లో సైతం కూరగాయలను అం తర పంటగా వేసుకుంటే అదనపు ఆదా యం ఉంటుందని తెలిపారు. అన్ని పంటల తో పోలిస్తే తకువ కాలంలో నికర లాభాలు ఇచ్చేవి కూరగాయ పంటలేనని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు.