హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావుకు శుక్రవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నవీన్‌రావు ప్రసంగిస్తూ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. కోర్టులతో తనకు గత 36 ఏండ్లుగా ఉన్న అనుబంధం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో జస్టిస్ ఏపీ శేషసాయితో కలిసి తాను చేసిన కసరత్తు ఫలితంగా తెలంగాణ హైకోర్టు వ్యవహారాలు సామరస్యంగా కొలికివచ్చాయని తెలిపారు. తొలుత న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ప్రసంగిస్తూ.. అనేక చారిత్రక తీర్పులు వెలువరించిన జస్టిస్ నవీన్‌రావు న్యాయ వ్యవస్థకు ఎనలేని సేవలందించారని, ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ తీర్పులు వెలువరించి చరిత్రకెకారని కొనియాడారు.
కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసా ద్, అదనపు ఏజీ జే రామచందర్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, అదనపు సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, పీపీ ప్రతాప్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, జస్టిస్ నవీన్‌రావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తుల చాంబర్లో జస్టిస్ నవీన్‌రావు దంపతులను జస్టిస్ షావిలి దంపతులు సతరించారు.
తాత్కాలిక సీజేగా జస్టిస్ షావిలి
జస్టిస్ నవీన్‌రావు పదవీ విరమణ చేయడంతో హైకోర్టు తాతాలిక సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి బాధ్యతలు స్వీకరించన్నారు. ఇప్పటివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం సుప్రీంకోర్టు న్యా యమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు.