నల్లగొండ : నల్లగొండ పట్టణాన్ని(Nalgonda town) పొగమంచు కమ్మేసింది(Fog engulfed). ఆదివారం ఉదయం 8గంటల వరకు భానుడు దర్శనమివ్వలేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగ మంచు కురుస్తుండడంతో ఇండ్లను వదిలి బయటికి రాని పరిస్థితి నెలకొంది. రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడ్డారు. వివిధ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు రోడ్డుపై దట్టమైన మంచు ఉండడంతో లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరగడంతో జన సంచారం తగ్గింది. కొద్దిసేపటి తరువాత భానుడి లేలేత కిరణాలకు మంచు తెరలు క్రమంగా కనుమరుగయ్యాయి.
పొగమంచు కారణంగా లైట్లు వేసుకొని వెళ్తున్న ప్రయాణికులు