హదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అగ్నిప్రమాదాల్లో మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అగ్నిమాపకశాఖ ఏడీజీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ వేసవి మొత్తం ఆ శాఖ సిబ్బంది సెలవులు త్యాగం చేసి మరీ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు ఫైర్‌కాల్స్ ద్వారా లొకేషన్‌కు వెళ్లి 24 మందిని, ఫైర్‌కాల్స్ కాకుండా మరో 127 మందిని.. మొత్తం 151 మంది ప్రాణాలను కాపాడారు. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 4,514 ఫైర్‌కాల్స్ రాగా, రూ.690 కోట్లకుపైగా ఆస్తి నష్టాన్ని నివారించారు. 2014 నుంచి 2022 నవంబర్ వరకు 5,368 మంది ప్రాణాలను రక్షించారు. రూ.11,804.21 కోట్లుకుపైగా ఆస్తులను కాపాడారు. విపత్తుల నివారణ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.64,92, 24,000 కేటాయించింది.