Sircilla | ఇలా ఉరి వేసుకున్న ఫొటోలు ప్రచురించరాదని తెలుసు. కానీ పరిస్థితి తీవ్రతను వెల్లడించేందుకు ఇంతకుమించిన మార్గం లేకపోయింది. రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభం ఎన్నడూ చూడని వికల, విషాద దృశ్యాలను కండ్లముందు ఉంచుతున్నది. అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమైన చోట, మట్టిపూలు రాలుతుండటం మామూలు విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నచోట ఈ ఫొటో వేయడం ఓ అనివార్యత.
సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లికి చెందిన రైతు పర్శరాములు ఊరి పెద్దమ్మతల్లి గుడిలోని గంటకు ఉరేసుకున్నాడు. సాగునీరందక పంటలు ఎండుతుండటం, బోర్లు ఫెయిలై అప్పులపాలవడంతో గత్యంతరం లేక ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడు.