హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ధరణితో భూమికి ఇవాళ యజమాని రైతే అయ్యిండని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉన్న ఐదు.. పది.. మూడు.. నాలుగు ఎకరాలకు ఆయనే యజమాని అని అన్నారు. ఆ భూమి హక్కును ఉంచుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, గిఫ్ట్ ఇవ్వాలన్నా, అమ్ముకోవాలన్నా రైతు బొటనవేలితోనే సాధ్యమైతదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నేను, మీరు అంతా రైతు బిడ్డలమే. బాధాకరమైన విషయం ఏమిటం టే.. ఒక రైతు మీదికి ఎంత మంది పెత్తనం? వీఆ ర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (గిర్దావర్), ఎమ్మా ర్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ అనేటాయన.
ఆయన మీద రెవెన్యూమంత్రి. వీళ్లలో ఎవరికి దయ కలుగకపోయినా, ఎవ్వలకు కోపమొచ్చినా భూమి గల్లంతు. ప్రతి దగ్గర రెవెన్యూ కోర్టు. ఎమ్మార్వో కోర్టు. ఆర్డీవో కోర్టు. జాయింట్ కలెక్టర్ కోర్టు. కలెక్టర్ కోర్టు. సెక్రటరీ కోర్టు. మినిస్టర్ కోర్టు. ఏ ఒక్క దగ్గర పెద్దమనిషి ముక్కు ఇరిసినా ఉన్న భూమి ఊసిపోతది. అంత దీన స్థితి తెలంగాణ రైతాంగానిది. రైతులు గోసపడుతున్నరు.. వాళ్ల భూ మి వాళ్లది కాకపోతున్నది. పెత్తనం ఇంకొకరు చెలాయిస్తున్నరని, వేల కోట్ల లంచాలు దండుకుంటున్నరని, అనేక రకాల బాధలు పోవాలని ధైర్యంగా గట్టి నిర్ణయం తీసుకున్నం. ఎన్టీ రామారావు రద్దు చేసిన పటేల్ పట్వారీ వ్యవస్థ తరహాలో ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకగా ఉన్న వీఆర్వో వ్యవస్థను తీసేసినం. రికార్డులన్నీ డిజిటలైజ్ చేసినం. దాని ఫలితమే ధరణి.
నాడు రిజిస్ట్రేషన్‌కు పోతే సద్దులు గట్టుకుని పోయే పరిస్థితి. పోద్దంతా ఉన్నా రేపు రాపో అంటరో అన్న స్థితి. గంటలు, పూటలు.. రోజుల తరబడి పడిగాపులు. ఈ రోజు ధరణి పుణ్యమా అని 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, ఆ తర్వాత 5 నిమిషాల్లో మ్యుటేషన్.. ఆ తర్వాత 5 నిమిషాల్లో వెబ్సైట్లోకి వచ్చేస్తది. భూమి కొన్న వ్యక్తి భూగోళంలో ఎక్కడున్నా నిమిషాల్లో సెల్ఫోన్లో చూసుకోవచ్చు. ధరణి ఉంది కాబట్టే ధాన్యం పైసలు అకౌంట్లళ్ల పడుతున్నవి. రైతు బం ధు వస్తున్నది. ఎంత సుందర దృశ్యమంటే జూన్ వచ్చిందం టే. వేల మంది రైతుల సెల్ఫో న్లు టింగ్‌టింగ్‌మని ఒకేసారి మోగుతున్నయి. రైతుబంధు ప డ్డదని ఒకరికొకరు చెప్పుకుంటున్నరు. హైదరాబాద్‌ల ఉం డి బటన్ నొక్కితే.. దరఖా స్తు పెట్టకుండా, ఆఫీసుకు పోకుండా.. రూపాయి లంచం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి పోతున్నవి. రూ.73 వేల కోట్లు అత్యంత పారదర్శకంగా, అవినీతిరహితంగా ప్రభు త్వం నుంచి రైతులకు పంచుతున్న ఒకే ఒక్క ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వం. ఇదంతా ధరణి వల్లే.
రావాల్సింది రైతు రాజ్యమా? రాబందుల రాజ్యమా?
కాంగ్రెసోళ్లు ఎంత అన్యాయంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నరంటే.. ధరణి తీసేస్తం అంటున్నరు. తీసేసి ఏం జేస్తరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలని నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్న. మీరు ధరణిని తీసేసి మీరు ఏం జేస్తరు. మల్లా రాబందుల రాజ్యమా? మల్లా పైరవీకారుల రాజ్యమా? మల్లా భూకబ్జాల రాజ్యమా? ఒక్కొక్క భూమికి డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ల రాజ్యమా? రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా? ధరణి తీసేసి ఏం చేస్తరు? ఎట్లా మాట్లాడుతరు? ధరణి వల్ల నేను చెప్పిన భర్తలంతా తొలగిపోయిండ్రు. ఇంతకు ముందులా కలెక్టర్ దగ్గర, ఆర్డీవో దగ్గర, ఎమ్మార్వో దగ్గర, మినిష్టర్ దగ్గరున్న అధికారాన్ని తీసేసి రైతులకిచ్చినం’ అని సీఎం పేర్కొన్నారు.