హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
6-10వ తరగతి వరకు గల విద్యార్థులు అక్టోబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.