హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు సోమవారం విడుదలకానున్నాయి. telanganams. cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మాడల్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు.
ఈ నెల 7న మాడల్ స్కూల్ ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు.