కొడకండ్ల, డిసెంబర్ 12: జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నర్సింగాపురం గ్రామంలో విద్యుత్తు సిబ్బం ది కొత్త ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మేం పంటలు వేయాలా? వద్దా?’ కథనానికి సంబంధిత విద్యుత్తు అధికారులు స్పందించారు.
హుటాహుటిన కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తొలగించి కొత్తది బిగించారు. దీంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తూ యాసంగి సాగుపై దృష్టి పెట్టారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ రావడానికి కారణమైన ‘నమస్తే’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.