హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తకువ ధరకే ఇండ్లు ఇస్తామంటూ మధ్యతరగతి అమాయక ప్రజలను మోసం చేసిన ‘భారతి బిల్డర్స్’ వ్యవహారంలో ఈడీ కొరడా ఝుళిపించింది. ఈ మేరకు పీఎంఎల్ఏ యాక్టు కింద ఆ సంస్థ, భాగస్వాములు, కుటుంబ సభ్యులకు చెందిన 17.97 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాతాలికంగా జప్తు చేసినట్టు తెలిపింది.
సైబరాబాద్బాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టినట్టు వెల్లడించింది. ప్రధాన నిందితులు ముల్పూరి శివరామకృష్ణ, దూపాటి నాగరాజు, దొడ్డకుల నరసింహారావు బయ్యర్లను మోసం చేసినట్టు దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నది.