కఠినంగా ఎప్‌సెట్ గణితం ప్రశ్నలు!
ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం జరిగిన పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు విద్యార్థులను ఇబ్బందిపెట్టాయి.
- సమయం సరిపోలేదన్న విద్యార్థులు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం జరిగిన పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలు విద్యార్థులను ఇబ్బందిపెట్టాయి. ముఖ్యంగా గణితం ప్రశ్నలు జేఈఈ స్థాయిలో ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో సమయం సరిపోలేదని పేర్కొన్నారు. ఫిజిక్స్ సైతం కాస్త కఠినంగానే ఉన్నట్టు కొందరు విద్యార్థులు చెప్పారు. కెమిస్ట్రీ మధ్యంగా ఉన్నట్టు, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్ పాఠ్యాంశాల నుంచి అధిక ప్రశ్నలిచ్చినట్టు వెల్లడించారు. గణితం ప్రశ్నలు కాస్త కఠినంగా ఇవ్వగా, కెమిస్ట్రీ సులభంగా ఉన్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కో ఆర్డినేటర్ ఉమాశంకర్ విశ్లేషించారు.
93 శాతం హాజరు..
ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు ఆదివారం 93 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదయం సెషన్లో 35,092 మంది విద్యార్థులకు 32,673 (93.11శాతం), మధ్యా హ్నం సెషన్లో 35,518 మందికి 33,225 (93.54 శాతం) విద్యార్థులు హాజరైనట్టు వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

