విద్యుత్తు ఆర్టిజన్ల డిమాండ్లు నెరవేర్చాలి.. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
విద్యుత్తు సంస్థల్లో దశాబ్దాలుగా శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో దశాబ్దాలుగా శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆర్టిజన్ల సమస్యలు పరిషరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అనుసరిస్తున్నదని ఆరోపించా రు. తమ న్యాయమైన డిమాండ్ల సా ధన కోసం నిరవధిక సమ్మెలో ఉన్న ఆర్టిజన్ కార్మికులకు సంపూర్ణ మద్ద తు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
తాగునీరు, లైటింగ్ వంటి కనీస సదుపాయాలు కూడా లేని సబ్స్టేషన్లలో, తీవ్రమైన సిబ్బంది కొరతతో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. విద్యార్హతలను బట్టి కార్మికులను జూ నియర్ లైన్మన్, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్ చేయాలని కోరారు. కార్మికులను సం స్థలో విలీనం చేసుకోవాలని, పీస్ రే ట్ వరర్స్ అందరికీ కనీస వేతన చట్టం అమలు చేయాలని, కార్మికులందరికీ ప్రతి నాలుగేండ్లకూ ఒకసారి ఇచ్చే ‘పీఆర్సీ -2026ను అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

