హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో విశేష పురోగతి కనబరుస్తున్న హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కొవిడ్ ప్రభావం తగ్గడం, ఉద్యోగులు ఆఫీసులకు వస్తుండటంతో కారిడార్ కిటకిటలాడుతుండగా, కంపెనీల విస్తరణ చురుగ్గా సాగుతున్నది. ఫలితంగా ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీ అనేది కష్టతరంగా మారింది. కారిడార్‌లో కీలకమైన మైండ్‌స్పేస్ హౌస్‌ఫుల్ కావడంతో నిర్మాణ సంస్థలు పాత నిర్మాణాల స్థానంలో ఆకాశహర్మ్యాలకు శ్రీకారం చుడుతున్నాయి.
95 శాతం ఫుల్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మైండ్‌స్పేస్ అనేది అత్యంత కీలక ప్రాంతం. 2004లోనే దీనికి పునాది పడింది. సుమారు 110 ఎకరాల్లో ఏర్పాటైన మైండ్‌స్పేస్‌లో 7-8 ఏండ్లుగా గణనీయమైన వృద్ధి నమోదైంది. ఇక్కడ 11 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉంటే ప్రస్తుతం 10.5 మిలియన్ చదరపు అడుగుల్లో కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. దీంతో తొలిసారి 5 శాతం అంటే సుమారు 0.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ మాత్రమే ఖాళీగా ఉన్నది. ఇటీవల అమెరికాకు చెందిన సంస్థ ఏకంగా 1.02 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకొన్నట్టు మైండ్‌స్పేస్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది.
మూడింతలు పెరిగిన ఎగుమతులు
ఐటీ రంగంలో ఎగుమతులు మొదలు.. ఉద్యోగుల పెంపు వరకు హైదరాబాద్.. దేశంలోని అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి దూసుకుపోతున్నది. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ.57వేల కోట్లు ఉంటే తాజాగా రూ.1.83 లక్షల కోట్లకు చేరుకొన్నది. అలాగే టెక్కీల సంఖ్య కూడా 3 లక్షల నుంచి 8 లక్షలకు పెరిగింది. ఐటీ రంగంలో జాతీయ సగటు వృద్ధి 17.28 శాతం ఉంటే.. తెలంగాణలో 26.14 శాతం నమోదు కావడం అసాధారణ విషయం. కొవిడ్ ప్రభావం వల్ల కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నప్పటికీ ఈ డిమాండ్‌కు ఢోకా లేకపోవడం విశేషం.
ఊహించని ప్రస్థానం
ఐటీ కారిడార్‌లో రీ డెవలప్మెంట్కు ఉదాహరణలు