హైదరాబాద్ జూన్ 3 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల్లో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం పురపాలక శాఖ కమిషనర్ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే సర్వే ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ నెల 4న సాధారణ ప్రజలతోపాటు అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు వార్తా పత్రికల్లో ప్రకటనలు విడుదల చేస్తామని తెలిపారు.
ఈ నెల 5 నుంచి 11 వరకు సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 12 నుంచి 16 వరకు విచారణ చేపడతామని పేర్కొన్నారు. 17, 18 తేదీల్లో అప్రూవల్ కోసం కలెక్టర్లకు అప్పీల్ చేస్తామని తెలిపారు. 19న మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని, 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు. 21వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు.