హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కోర్టు కేసులకు సంబంధించి ఒక లిటిగేషన్ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. హైకోర్టులో ఎకువ కేసులు రాష్ర ప్రభుత్వానివే ఉన్నాయని, దీంతో కోర్టులపై భారం పెరుగుతున్నదని వ్యాఖ్యానించింది.
రూ.3.45 లక్షల వైద్య ఖర్చులకు రూ.లక్ష మాత్రమే మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ జిల్లా కోర్టు రిటైర్డ్ ఉద్యోగి పీ అశోక్‌రాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సీజే జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. వాస్తవ ఖర్చును మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని సర్కారుకు సూచించింది.