బార్ కౌన్సిల్‌కు 23 మంది ఎన్నిక.. ముగిసిన ఓట్ల లెక్కింపు
రాష్ట్ర బార్‌కౌన్సిల్‌కు జనవరి 30న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం పూర్తయ్యింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 23 మంది ఎన్నికయ్యారని బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి తెలియజేశారు.
- విజేతల్లో ఐదుగురు మహిళలు
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్‌కౌన్సిల్‌కు జనవరి 30న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం పూర్తయ్యింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 23 మంది ఎన్నికయ్యారని బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి తెలియజేశారు. సభ్యులుగా పొన్నం అశోక్‌గౌడ్, జాకీర్‌హుస్సేన్ జావేద్, మహేశ్‌కుమార్, అనంతసేన్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, సునీల్‌గౌడ్, కిరణ్‌కుమార్, వెంకట్‌యాదవ్, రఘునాథ్, సహోదర్‌రెడ్డి, రామ్‌రెడ్డి, మధుసూదన్‌రావు, ముఖీద్, అనిల్‌కుమార్, శ్రీనివాస్‌రావు, జగదీశ్‌రావు, రామారావు, రాఘవులు ఎన్నికయ్యారు.
మహిళల కోటాలో భానుచంద్రిక, శైలజ, పరిపూర్ణ, సుజాత, సునీత ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో ఇద్దరు మహిళా సభ్యులను హైపవర్ కమిటీ ఎంపిక చేస్తుంది. అడ్వకేట్ జనరల్ ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉంటారు. ఒకరిని బార్ కౌన్సిల్ చైర్మన్‌గా, వైస్‌చైర్మన్‌గా ఒకరిని, అఖిల భారత బార్ కౌన్సిల్ సభ్యుడిగా మరొకరిని ఎన్నుకుంటారు.
సుప్రీంకోర్టు హైపవర్ కమిటీ నేతృత్వంలో ఈ ఎన్నికలు జరిగాయి. రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా 35,316 మంది ఓటర్లు ఉండగా వారిలో 7వేల మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. ఈసారి ఎన్నికల ప్రచారం చట్టసభ ఎన్నికలను తలపించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

