హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : అమలుకాని హామీలిచ్చి, అబద్ధపు ప్రచారాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అబద్ధపు హామీలు ఇచ్చారని, ఇప్పుడు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను సౌత్ చెన్నైలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.